కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. అలాగే గుర్తింపు కార్డులు వచ్చేటట్లు చూస్తామని తెలిపారు. అంతేకాకుండా రీ పేమెంట్ రేగులైజెషన్ చేసుకోవాలని, కొత్తగా ఎస్.హెచ్.జి గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని, ముందు ఉన్న బకాయిలు చెల్లించాలని, అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి ఎస్.ఎల్.ఎఫ్ గ్రూప్ లను రెన్యువల్ మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలిపారు.
అంతేకాకుండా 10 ఎస్.హెచ్.జి ల గ్రూప్ లలో కనీసం 5 మంది అయినా మంచి బిజినెస్ చేసుకోవాలని అన్నారు. అలాగే ఖైత్లాపూర్ లో మహిళా భవన్ నిర్మించి కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేస్తామని , వారికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించి వేతనాలు కూడా సక్రమంగా అందేటట్లు చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కి నివేదిక అందిస్తామని హామీ ఇచ్చారు.. అలాగే ఏప్రిల్ రెండవ తేదీన జరుగు జాబ్ మేళాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు