కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి

Spread the love

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి…

ఘనంగా బంగారు మైసమ్మ తల్లి బోనాల పండుగ.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు , MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి 10వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి మధుర మీనాక్షి రూపంలో అలంకరణ భక్తులకు కనుల విందుగా అనిపించింది. ఉదయం నుండే భక్తులతో ఆలయం అంత కిటకిటలాడింది. ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు మరియు MLA కేపీ.వివేకానంద అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page