SAKSHITHA NEWS

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్‌: ఖమ్మం వన్ టౌన్ సిఐ

ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం వన్ టౌన్ సిఐ ఉదయ్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి 8 లక్షల విలువ చేసే 32 కిలోల గంజాయి, 5000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు, మరో ఇద్దరు నిందుతులు పరారీలో వున్నట్లు పెర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..
మిశాల్ అనే ఏ 4 నిందుతుడు
సూచనల మేరకు సికింద్రాబాద్ లో వుంటున్న ఏ3 నిందుతుడు సంజయ్ సింగ్ కు 32 కేజీల గంజాయి అప్పగించేందుకు
ఒడిస్సా రాష్ట్రం,గజపతి జిల్లా,బోమిక గ్రామానికి చెందిన ఏ1) భరత్ అలియానా,52 సం,, ఏ2) పద్మ తుల అలియానా, 45 సం,, అనే ఇద్దరు నిందుతులు గంజాయిని విశాఖపట్నంలో తీసుకొని రైల్లో సికింద్రాబాద్ బయలుదేరారు. ఎవరికి అనుమానం రాకుండా సోమవారం ఖమ్మం రైల్వే స్టేషన్ దిగారు. మరో రైలులో సికింద్రాబాద్ వెళ్లెందుకు ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో వున్న రామాలయం దేవాలయం వద్ద వేచివున్నారు. అనుమానాస్పదంగా వున్న ఇద్దరినీ ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తసుకొని బ్యాగులు తనిఖీ చేయగా 32 కేజీల గంజాయి, ఐదు వేల రూపాయల నగదు వున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై క్రైమ్ నెంబర్
161/2024 అండర్ సెక్షన్8 (సి) ఆర్ /డబ్ల్యూ 20 (బి) (ii) (సి), 29 ఎన్ డి పి ఎస్ యాక్ట్ -1985 కింద ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సిఐ తెలిపారు.

WhatsApp Image 2024 04 29 at 8.04.51 PM

SAKSHITHA NEWS