ఇటీవలే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత మైనంపల్లి హన్మంతరావును.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కుత్బూల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్. హన్మంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా పార్టీ మరింతగా బలపడిందని తెలిపారు హన్మంత్ రెడ్డి. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థి కొలన్. హన్మంత్ రెడ్డికి తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు మైనంపల్లి. హన్మంత్ రావు.
కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలు నచ్చి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు మైనంపల్లి హన్మంత్ రావు. తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. బీఆర్ఎస్ అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంత్ రావు తెలిపారు.