కల్వకుర్తి యువత అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలి.

Spread the love

Kalvakurti youth should excel in international sports

కల్వకుర్తి యువత అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలి.

సాక్షిత ప్రతినిధి.

చదువుతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
కల్వకుర్తి: కల్వకుర్తి ప్రాంతం అంటేనే దశాబ్దాలుగా క్రీడాకారులకు పుట్టినిల్లు అని, ఎన్నో ఏళ్లుగా కల్వకుర్తి యువత రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించడం జరుగుతుందని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ తెలిపారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంతో పాటు అనంతరం సైతం తీవ్ర ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో క్రీడా మైదానం నిర్మించడంలో ప్రత్యేక నిధులు కేటాయించడంలో ఎంతో కృషి చేసినట్లు గుర్తు చేశారు.

కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఐటిఐ కళాశాల, బస్టాండ్, బస్ డిపో, నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్, సరఫరా సబ్ స్టేషన్ల ఏర్పాటు, విద్యా, రవాణా సౌకర్యంతో పాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించేందుకు యువత స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభించడంతో పాటు, దేహదారుడ్యం పెంపొందుతుందని పేర్కొన్నారు.

కల్వకుర్తిలోని క్రీడా మైదానంలో శ్రీరామాంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ క్రీడలకు జిల్లా స్థాయిలో క్రీడాకారులు తరలి రావడం శుభ పరిణామం తెలిపారు. భవిష్యత్తులోనూ రామాంజనేయ యూత్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని చిత్తరంజన్ దాస్ ఆకాంక్షించారు.

నేటి యువత మద్యం తదితర వ్యసనాలకు బానిసై తమ జీవితాలను కోల్పోతున్నారని, దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారిస్తూ క్రీడల్లో రాణించడంపై దృష్టి కేంద్రీకరించాలని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు.

అంతకుముందు చిత్తరంజన్ దాస్ క్రీడాకారులను ఒక్కొక్కరిగా పరిచయం చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, కొద్దిసేపు క్రికెట్ ఆడి అలరించారు. ఈ సందర్భంగా రామంజనేయ యూత్ ఆధ్వర్యంలో మాజీమంత్రి చిత్తరంజన్ దాస్, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య యాదవ్, నాయకులు అంజయ్య గౌడ్, శశి కుమార్ గౌడ్, రాజేష్, హర్ష తదితరులను పూలమాలలు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో రామాంజనేయ యూత్ నిర్వాహకులు రామాంజనేయులు, రాము యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page