ఇంద్రానగర్ కాలనీలో హజ్ వెళ్లే కుటుంబాని ఘనంగా సన్మానించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం
సాక్షిత ప్రతినిధి. అక్టోబర్ 6.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో హజ్ వెళ్లే మన్సూర్. నవాజ్. కుటుంబ సభ్యులకు కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం వైస్ చైర్మన్ షాహేద్. మండల ప్రెసిడెంట్ విజయ్ గౌడ్. కౌన్సిలర్ సైదులు గౌడ్. భోజి రెడ్డి. కిషోర్ రెడ్డి. మక్బుల్. మైనార్టీ సోదరులు మన్సూర్ ఖాన్. నవాజ్ లను పూలదండలు వేసి శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని హజ్ వెళ్లే కుటుంబా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హజ్ యాత్ర గొప్పతనాన్ని వివరించారు. మైనార్టీ సోదరుడు క్షేమంగా వెళ్లి రావాలని ఆయన కోరారు. ఇట్టి కార్యక్రమంలో నేరటి శేఖర్. సాయి గౌడ్ ఇంద్రనగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు