కామారెడ్డి జిల్లా
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచారాలతో హీటెక్కిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవ్వాళ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు.
ఓటు ఒక బ్రహ్మాస్త్రం దాన్ని సరైన పద్ధతిలో వాడితేనే మన తలరాతలు మారతాయని కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అనే పార్టీలు వస్తాయి.. అనేక మంది నాయకులు అనేక మాటలు చెప్తారు. కానీ ఆలోచన చేసి ఓటు ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.
మీరు మీ సొంత విచక్షణతో ఓటు వేయాలి. ఎవరో చెప్పారు అని ఓటేస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతుందని,ఎవరు ఆగం కావద్దని కేసీఆర్ పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పదేండ్ల కింద మన పరిస్థితి ఎలా ఉండే.. ఇవాళ ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలి అని కేసీఆర్ సూచించారు.
జుక్కల్ నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతం.. కారు చీకటి, మంచినీళ్లు, సాగునీళ్లు లేవు. దూర ప్రాంతాలకు వలసపోయిన పరిస్థితి. రైతులు అప్పులు కట్టలేక, బోర్లు వేయలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అవన్నీ మనం చూశాం. నేను 27 బోర్లు వేస్తేకానీ నీళ్లు రాలేదు. అలాంటి బాధలు మనం అనుభవించాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
సమైక్య పాలకుల రాజ్యంలో ఎండిపోయిన నిజాం సాగర్
ఇవాళ తెలంగాణలో మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నాం.
100 ఏండ్ల కింద నిజాం రాజు నిజాం సాగర్ కట్టారు. సమైక్య పాలకుల రాజ్యంలో నిజాంసాగర్ ఎండిపోయింది. మన బాధలు ప్రపంచానికి తెలియాలని ఎండిపోయిన నిజాం సాగర్‌లోనే తెలంగాణ ఉద్యమం మీటింగ్ పెట్టుకున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు…