It is illegal.. we will tear it down
అది అక్రమమే.. కూల్చుతాం..!*
కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరెందర్
గణపతి కాలనీ వ్యవహారం పై కమిషనర్ వివరణ
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
కొత్తూరు మున్సిపాలిటీలోని గణపతి కాలనీ దయానియస్థితి పై బాధితుల ఆక్రందన తగ్గడం లేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీ మొత్తం నీట మునుగుతుంది. పక్కనే ఉన్న పాటు కాలువ కబ్జా వ్యవహారంపై ఇటీవలే సమాచార హక్కు చట్టం కింద లోగోట్టు బయటపడింది.
అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ మున్సిపాలిటీ సంబంధిత పెద్దమనిషికి నోటీసులు కూడా జారీ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో సిటీటైమ్స్ ప్రతినిధి కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరేందర్ ను వివరణ కోరగా.. ఆయన మాట్లాడుతూ.. గణపతి కాలనీ అక్రమ కట్టడాల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని ఇప్పటికే సదరు వ్యక్తికి నోటీసులు అందజేశామని పేర్కొన్నారు.
నోటీసు జవాబు కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని సంకేతాలు మీడియాకు ఇచ్చారు. అక్రమ కట్టడాలను ఉపేక్షించబోమనే విషయాన్ని ధృవీకరించారు.
కొత్తూరు తండా లోని సర్వోని కుంట నుంచి అలుగు పారిన వరద నీరు పాటు కాలువ ద్వారా కొత్తూరులోని కాశన్న కుంటకు చేరుతున్న క్రమంలో ఈ మధ్యలో ఉన్న గణపతి కాలనీ వద్ద కాలువ కబ్జాకు గురైంది. ఓ వ్యక్తి కాలువను ఎంచక్కా దర్జాగా కబ్జా చేయడంపై స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాల్వ కబ్జాపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఇరిగేషన్ శాఖ జియో మాఫికల్ సర్వే ఇటీవల నిర్వహించింది. పాత రికార్డులను తిరిగేసింది. కాలువ పారే నీటికి భిన్నంగా దారిమలినట్టు అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చిన లేఖలో కూడా ఐబి ఇరిగేషన్ శాఖ క్లుప్తంగా పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కొత్తూరు కమిషనర్ వీరేందర్ స్పష్టం చేయడంతో కథ క్లైమాక్స్ కు చేరుకుంది..