Invitation to Minister Dharmana for Rathasaptami celebrations
రథసప్తమి వేడుకలకు మంత్రి ధర్మానకు ఆహ్వానం
శ్రీకాకుళం లో ఈ నెల 28న శనివారం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరగనున్న రథ సప్తమి వేడుకలకు రెవెన్యూ,రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖా మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావును ఆలయ కార్యవర్గం ఆహ్వాన పత్రం అందించింది.ఈవో హరి సూర్య ప్రకాష్,ప్రధాన అర్చకులు శంకర శర్మ, మందవిల్లి రవి,కలిసి వేడుకలకు విచ్చేయాలని మంత్రి ధర్మానను ఆయన నివాసంలో కలిసి కోరారు.సప్తమి సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను మంత్రికి వివరించారు.