శానిటేషన్ అధికారులతో కలిసి రాంకీ సిబ్బందితో పరిచయ కార్యక్రమం

Spread the love

Introductory program with staff of Ranki along with Sanitation Officers

సాక్షిత : కూకట్పల్లి సర్కిల్ – 24 మూసపేట మునిసిపల్ ఆఫీస్ లో, డిప్యూటీ కమిషనర్ రవీందర్ , వివేకనంద నగర్ కార్పొరేటర్ రోజా రంగారావు మరియు శానిటేషన్ అధికారులతో కలిసి రాంకీ సిబ్బందితో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచడమే కాకుండా వారి ఆరోగ్యము కూడా మన బాధ్యత అని పారిశుధ్య కార్మికులను కాపాడుకోవాలనే ధ్యేయం తో ముఖ్యమంత్రి కేసీఆర్ సహృదయంతో ఆరోగ్య పరిరక్షణకు PPE కిట్ల ను కూడా అందచేయడం జరిగినది అని, పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య భద్రతే మన భద్రత అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అలానే రాంకి సంస్థ సిబ్బంది పరిచయ కార్యక్రమం జరిగింది అని, రాంకీ వారు మన శానిటరీ సిబ్బంది కలసి కాలనీ లన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఏటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎస్ ఎస్ లింగారెడ్డి, SRP సత్యనారాయణ, SFI లు శ్రీకాంత్, భరత్, సంజీవరావు, వెంకట్రావు, మల్లేష్, గోపాల్, వెంకట రమణ తదితరులు పాల్గోన్నారు.

Related Posts

You cannot copy content of this page