ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలు

SAKSHITHA NEWS

ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అధికారులకు కోరారు.

 ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్ నందు  ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలలో మొదటి సంవత్సరం 3,990 మంది, రెండవ సంవత్సరం 4,575 మంది విద్యార్థినీ, విద్యార్థులు  మొత్తం 8,567 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయానికి విద్యార్థినీ, విద్యార్థులు  8:30 గం.లకు  పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని , ఒక నిమిషం ఆలస్యం అయిన పరీక్ష కేంద్రానికి అనుమతి ఉండదని తెలిపారు.  గ్రామాల నుండి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా ఆర్.టి.సి అధికారులు  ప్రత్యేక బస్సులను  7:00 గం.లకు అందుబాటులో ఉండాలన్నారు. 

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని, పరీక్ష కేంద్రానికి  సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష సమయంలో విద్యార్థులు మాల్ ప్రాక్టిస్ చేసినచో చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పట్టుబడే విద్యార్థులకు రానున్న పరీక్షలో అనర్హులవుతారని తెలిపారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద  హాల్ టిక్కెట్ లలో ఏదైనా  సమస్య ఉంటే విద్యార్థులకు సహకరించేందుకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా సమయంలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్‌ ను సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో త్రాగు నీరు , మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని, వైద్య అధికారులు సిబ్బందిని నియమించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసి అవసరమైన మందులు,

ఓ. ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు, హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమం లో ఆర్.డి.ఓ చంద్రకళ ,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయ రాజు, ఇన్చార్జ్ డి.ఈ.ఓ ఇందిర, ఆర్.టి.సి డి ఎం మంజుల, డిప్యూటి డి.ఎం.ఎచ్.ఓ సిద్దప్ప, పోలీసు శాఖ ,విద్యుత్ శాఖ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS