SAKSHITHA NEWS

గద్వాల శాసన సభ్యులు బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి..

వినతిపత్రం ఇచ్చిన 3 రోజుల లోపే స్పందించి ప్రిన్సిపాల్ ని నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర్ రాజా నర్సింహా కి గద్వాల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు

త్వరలోనే మెడికల్ కాలేజీ లో తరగతులు ప్రారంభం…

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీ మంజూరు చేసిన నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్సిపాల్ ను నియామకం చేశారు..

అన్ని రంగాలలో గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే …

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ…

ఎమ్మెల్యే మాట్లాడుతూ….

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలోని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో జోగులాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడం జరిగింది. జీవో నెంబర్ 80, 5-7-2023 తేదీ నాడు జోగులాంబ గద్వాల జిల్లాకు వంద మంది ఎంబిబిఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ మంజూరు కావడం జరిగింది. జీవో నెంబర్ తేదీ 16- 9 -2023 మెడికల్ కాలేజీ గత ప్రభుత్వం 183 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం జరిగింది. గద్వాలలో 300పడకల ఆసుపత్రి నిర్మాణానికి జీవో నెంబర్ 149 తేదీ 3-11-201 49 కోట్ల 16 లక్షల రూపాయలు నిధులను కేటాయించడం జరిగింది.

Whatsapp Image 2024 01 12 At 1.27.55 Pm

SAKSHITHA NEWS