హైదరాబాద్ మెట్రో రైలు (ఫేజ్ 2)

Spread the love

సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ. ఫేజ్ 2 లో మొత్తం 70 కిలోమీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. సిటీలోని నలుమూలాల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ కనెక్ట్ అయ్యేలా కొత్త రూట్​ డిజైన్​ చేశారు.

■ కేవలం కొద్ది మందికి ఉపయోగపడేలా గత ప్రభుత్వం నిర్దేశించిన రూట్ ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం.

■ మఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సూచనలతో హైదరాబాద్ మెట్రో రైలు కొత్త రూట్ మ్యాప్ తయారైంది.

■ తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్ డిజైన్ చేయటం విశేషం.

■ హైదరాబాద్​లోని అన్ని రూట్లలో కనెక్టివిటీ పెంచటం ద్వారా సామాన్యుల నుంచి సామాన్యుల వరకు మెట్రో రైలు సేవలను అందరికీ అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వ లక్ష్యం.

■ హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్ బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గ్ వరకు కనెక్టివిటీ ఉంది.

■ ఫేజ్ 2 విస్తరణలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్ ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగిస్తారు.

■ కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు రూట్ నిర్మాణం చేపడుతారు.

కొత్త రూట్ మ్యాప్

కారిడార్ 2; ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు (5.5 కిలోమీటర్లు)

కారిడార్ 2; ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కిలోమీటర్లు)

కారిడార్ 4; నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (మొత్తం 29 కిలోమీటర్లు)

కారిడార్ 4; మైలార్ దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు (4 కిలోమీటర్లు)

కారిడార్ 5; రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) వరకు (8 కిలోమీటర్లు)

కారిడార్ 6; మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు (14 కిలోమీటర్లు)

కారిడార్ 7; ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కిలోమీటర్లు)

Related Posts

You cannot copy content of this page