హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద రేపు జరగనున్న గణేష్ నిమర్జనం ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసిపి సతీష్, మున్సిపల్ పాలకవర్గం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గణేష్ నిమర్జనం శాంతియుతంగా నిర్వహించుకోవాలని మండపం నిర్వాహకులను కోరారు. రాత్రి పది గంటల వరకే నిమర్జనం పూర్తి చేయాలని, విగ్రహాల తరలింపులో డీజెలు పెట్టరాదన్నారు. గణేష్ నిమర్జన ప్రదేశానికి చిన్నపిల్లలను తీసుకురాకుండా చూడాలన్నారు. నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా గణేష్ ఉత్సవాల కమిటీ వారే పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఏసిపి తో పాటు మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ,సిఐ కిరణ్, ఎస్సై శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, , హుస్నాబాద్ మున్సిపల్ వర్గం తదితరులు పాల్గొన్నారు.
గణేష్ నిమర్జనం ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసిపి సతీష్, మున్సిపల్ పాలకవర్గం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కలిసి సందర్శించారు
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…