ఆరోగ్యమే మహాబలం…. సేవా దృక్పథం

Spread the love

ఆరోగ్యమే మహాబలం…. సేవా దృక్పథంతో పనిచేసే ప్రతి ఒక్క వైద్యుడు దేవుడితో సమానం: వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….

.
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి పేట్ బషీరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “వెల్ నెస్ హాస్పిటల్” ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ నిరుపేదలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో హాస్పిటల్ నిర్వాహకులు అధునాతన సదుపాయాలతో హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని, హాస్పిటల్ నిర్వాహకులు సేవా దృక్పథంతో పనిచేస్తూ మంచి పేరును గడించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, నరేందర్ రెడ్డి, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, కల్పన, హాస్పిటల్ డైరెక్టర్లు అసద్ ఖాన్, సుమన్ గౌడ్, వివేకానంద రెడ్డి, డాక్టర్ కార్తీక్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page