చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు

Spread the love


Happy birthday to Chevella MP Gaddam Ranjith Reddy

చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ వైస్ చైర్మన్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ..

చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ వైస్ చైర్మన్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఈరోజు చేవెళ్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అహర్నిశలు ప్రజల సేవకై పని చేస్తున్న మంచి మనసున్న ఎంపీ రంజిత్ రెడ్డి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ తో కలిసి చైర్ పర్సన్ శాంతికి చిహ్నలైన పావురాలను ఎగరవేయడం జరిగింది. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కేక్ కటింగ్ వేడుకలలో చైర్ పర్సన్ మంజుల రమేష్ పాల్గొనడం జరిగింది.

చైర్ పర్సన్ మంజుల రమేష్ తో పాటు వికారాబాద్ నియోజకవర్గ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి ముక్తహర్ షరీఫ్, వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు చందర్ నాయక్, నవీన్, కో ఆప్షన్ సభ్యులు షకీల్, నాయకులు మాలే లక్ష్మణ్, దీపు, టైగర్ కృష్ణ, హనుమంతు, శంకర్, సిద్ధిక్, బందెల్లి, పి.వెంకటయ్య, జైదుపల్లి నరసింహారెడ్డి, మాణిక్ రెడ్డి, పకూర్ ఖాన్ ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు ఎంపీ రంజిత్ రెడ్డి గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page