SAKSHITHA NEWS

జాన్ పహాడ్ దర్గాలో మొక్కుబడి తీర్చుకున్న హాజీ గౌస్ దంపతులు

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణ టిడిపి నాయకులు షేక్ హాజీ గౌస్ శ్రీమతి గుల్జార్ దంపతులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాన్ పహాడ్ లోని హజ్రత్ సయ్యద్
మొహినుద్దీన్ షహిద్, హజ్రత్ సయ్యద్ జాన్ పాక్ షహిద్ ల దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కుబడి తీర్చుకున్నారు. దర్గా ముజావర్లు ఖురాన్ కల్మాలతో ఆశీర్వచనాలు అందజేశారు. జాన్ పహాడ్ దర్గా మొక్కుకున్న కోరికలను తీర్చే దర్గాగా పేరొందిన దర్గా అని, జాన్ పహాడ్ దర్గా దర్శనం సకల శుభాలకు సంకేతం అని, ఇక్కడ కందోరి చేసినవారికి ధన లాభాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులకు అపారమైన నమ్మకం అని హాజీ గౌస్ తెలిపారు.షేక్ హజరత్, చాంద్ బేగం, సైఫ్, జాస్మిన్, షేక్ రహిమాన్, జరీనా, షేక్ ఖాదర్ మొహిద్దిన్, గులాబ్, మొహమ్మద్ సమియాన్ జాన్ పహాడ్ దర్గాలో దర్శించుకున్న వారిలో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app