SAKSHITHA NEWS

ఏఐను మంచి కోసం ఉపయోగిస్తే అద్భుతాలే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

మంత్రి పున్నం ప్రభాకర్ న్యూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ 2025 ఆహ్వానం పత్రిక ఇవ్వడం జరిగింది

మానవ జీవితంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎంతో కీలకంగా మారిందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు.

హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో మార్చి 8న న్యూరల్ ఏఐ గవర్నెన్స్ 2025 సమిట్ ను నిర్వహిస్తూ ఉన్నారు, ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ అధినేత డాక్టర్ వినయ్ కుమార్, న్యూరాల్ ఏ ఐ అధినేత మోహన్ కుమార్, మరియు దీప్తి, రాధిక, రామారావు,
పలువురు ప్రముఖులు, టెక్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మంత్రి పున్నం ప్రభాకర్ కి జాతీయ బీసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సమన్వయకర్తగా న్యూరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ 2025 ఆహ్వానం పత్రిక అందజేశారు .

ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఏఐ ను మంచి కోసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు చేయడానికి వీలవుతుంది. కానీ కొందరు ఏఐను ఇతర విషయాల కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఏఐ కారణంగా అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి మెషీన్‌ లెర్నింగ్‌ తోడవడంతో మరెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఏఐ వల్ల ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయోననే భయం వెంటాడుతూ ఉంది. ఏఐ ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించే దేశాల్లో భారత్ భాగమవ్వాలని దుండ్ర కుమారస్వామి కోరుతున్నారు.

ఆరోగ్య సంరక్షణ, రవాణా, రిటైల్, ఆర్థిక సేవలు, విద్య, ప్రజా భద్రతతో సహా దాదాపు అన్ని పరిశ్రమలలో AI వినియోగం వేగంగా పెరుగుతోందని కుమారస్వామి తెలిపారు. పలు విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏఐ పాలనలో అవగాహన కల్పించి, నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని దుండ్ర కుమార స్వామి తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో దశలవారీగా ఏఐ సాంకేతికత వినియోగాన్ని పెంచేలా ఒక రోడ్‌మ్యాప్‌ రూపొందించే అంశంపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఏఐ గవర్నెన్స్ గురించి అవగాహన కల్పించడానికి భారత్ లైట్ హౌస్ సంస్థ మరియు జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన భారత్ లైట్ హౌస్ సంస్థ మరియు జెనిసిస్ ఇన్ఫో ఎక్స్ ‘న్యూరల్ ఏఐ గవర్నెన్స్ 2025’ సమిట్ ను నిర్వహిస్తూ ఉంది. హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో మార్చి 8న న్యూరల్ ఏఐ గవర్నెన్స్ 2025 సమిట్ ను నిర్వహిస్తూ ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app