సర్వజ్ఞ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే

Spread the love

ఖమ్మం నగరంలోని స్థానిక వీడియోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలలో శనివారం నాడు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డి.జి.వో స్వర్ణకుమారి, సర్వజ్ఞ చైర్మన్ రాజా వాసిరెడ్డి నాగేంద్ర కుమార్ కే నీలిమ హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జ్యోతి ప్రజ్వలన చేసిన తరువాత ఆమె మాట్లాడుతూ సర్వజ్ఞ పాఠశాలలో కార్యక్రమాలు చాలా విన్నుతనంగా ఉన్నాయని. తల్లితండ్రులను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. తల్లితండ్రులు పిల్లలతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేయాలని ఒత్తిడి లేని విద్యను అందించాలి అని సూచించారు.
చదువుతోపాటు పలు రకాల ఆక్టివిటీస్ ని అందిస్తున్న సర్వజ్ఞా పాఠశాలని ఎంచుకున్నందుకు తల్లితండ్రులతో పాటు మేనేజ్మెంట్న అభినందించారు.


ఈ సందర్భంగా సర్వజ్ఞ చిన్నారులు శ్నాతకోత్సవ గౌను తోడుకొని తలపై టోపీలు పెట్టుకొని శ్నాతకోత్సవ మందిరంలో వారు హుషారుగా పట్టాలు అందుకున్నారు వారంతా యూకేజీ నుండి ఒకటవ తరగతి వెళ్లే చిన్నారులు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నీలిమా మాట్లాడుతూ ఇటువంటి వినూత కార్యక్రమాలను నిర్వహించడం వలన చిన్నారులకు స్కూల్ పై చదువుపై ఆసక్తి కలిగి ఉత్సాహంగా ఆనందంగా స్కూల్ కి వస్తారని మరియు వారు అన్ని అంశాలలో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సాధించేందుకు ఇటువంటి విన్నృత కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని వివరించారు. తమ పాఠశాల ప్రారంభం నుండి ఇటువంటి ఎన్నో విన్నుత కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రుల ఆదరాభిమానాలు పొందుతున్నామని ఆమె తెలిపారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను అతిగా గారాబం చేయకూడదని ఆమె తెలియజేశారు. చైర్మన్ రాజా వాసిరెడ్డి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులే పిల్లలకు మొదటి ఉపాధ్యాయులని వారు తమ పిల్లలతో ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని పిల్లలు అడిగే వివిధ ప్రశ్నలకు మనం ఎంతో ఓపికగా సమాధానం చెప్పాలని కోరారు దాని వలన చిన్నారులలో మానసిక ఉల్లాసం పెరిగి చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉంటారని అలాగే పిల్లలు మొబైల్స్ ఎక్కువగా వాడకూడదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాన్వకేషన్ డ్రెస్ తో పట్టాలు అందుకున్న తమ చిన్నారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు వారి అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మానస ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఇతర సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page