కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలలు…

Spread the love

Government schools to compete with corporate schools…

కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలలు

పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి…

ప్రగతినగర్ లో మన ఊరు-మన బడిలో ఏర్పాటు చేసిన వసతులు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.68 లక్షలతో అభివృద్ధి చేసిన కాంపౌండ్ వాల్స్, త్రాగు నీరు, విద్యుత్, వంట గది, టాయిలెట్స్, ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డ్స్ వంటి వసతులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ,

ఎడుకేషనల్ కమిషనర్ దేవసేన , స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం డిజిటల్ తరగతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా, కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ళలో ఉండే వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమమే మన ఊరు మన బడి అని అన్నారు.

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు విద్యార్థులకు సకల వసతులు కల్పిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు సులువుగా అర్థం అయ్యే విధంగా డిజిటల్ క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యతోపాటు విద్యార్థులకు మంచి భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌ అని చెప్పారు. సామాన్య, మధ్యతరగతి పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందన్నారు.

విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్, డిఈఓ విజయ కుమారీ, ఎంఈఓ ఆంజనేయులు, స్థానిక కమిషనర్ రామకృష్ణ రావు, స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ ఇంద్రజిత్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ నర్సింలు మరియు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page