SAKSHITHA NEWS

తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాDCCB,DCMS డైరెక్టర్ ,తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి రైతు సేవ సహకార సంఘానికి వానాకాలం పంట రుణాలుగా 25 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది .ఇట్టి పంట రుణాలను రైతులు తీసుకోవడానికి సొసైటీ CEO ను సంప్రదించాలని కోరినారు. అదేవిధంగా గతంలో పంట రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చే 3 శాతం రిబేటును పొందాలని కోరినారు. రైతులకు కావలసిన యూరియా సొసైటీలో అందుబాటులో ఉన్నదని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో CEO వెంకటేశ్వర్లు ,సొసైటీ వైస్ చైర్మన్ మోడం శ్రీలత, డైరెక్టర్లు రామచంద్రు, మల్లయ్య, మ జి దు ,బిక్షం రెడ్డి ,రామనరసమ్మ, ఇదప్ప ,యాకయ్య, రవీందర్ రెడ్డి ,చాంప్లా ,సొసైటీ సిబ్బంది యాదగిరి, మహేష్ ,ఉమేష్ పాల్గొన్నారు*


SAKSHITHA NEWS