Goli Srinivas Reddy's services should be recognized and the headship should allocate MLA ticket. గోలి శ్రీనివాస్ రెడ్డి సేవలను గుర్తించి అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి. సాక్షిత : పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తించి కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం కల్పించాలని పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ టిఆర్ఎస్ నాయకులు గోరటి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాటినుండి కల్వకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు గోలి శ్రీనివాస్ రెడ్డి చేపట్టారు అని పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్ అన్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమము నాటి నుంచి నేటి వరకు ఎలాంటి పదవి ఆశించకుండా టిఆర్ఎస్ పార్టీకి ప్రజలకు గోలి శ్రీనివాస్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి అని సర్పంచ్ గోరటి శ్రీనివాస్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటగా పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజల ఆపద్బాంధవుడుగా శ్రమించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించాడు, ఎవరైనా నిరుపేద ప్రజలు అనారోగ్య కారణాలవల్ల ఆసుపత్రిలో చేరితే వారిని పరామర్శించి తన వంతుగా సహాయ సహకారాలు అందించేవాడు. నియోజకవర్గ యువత క్రీడల్లో రాణించాలని క్రీడల్లో వారి నైపుణ్యం గుర్తించి టోర్నమెంట్లో నిర్వహించడం, క్రికెట్, వాలీబాల్ కిట్లు అందించి యువ క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ పటిష్టం చేయడం కోసం కల్వకుర్తి నియోజకవర్గంలో ఎంతగానో శ్రమించారు. ఏ పదవిలేని ఉద్యమ నేతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అని గోలి శ్రీనివాస్ రెడ్డి అని పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తేవడం గోలీశ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా గ్రామ గ్రామాన కమిటీలు వేసి టిఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడేలా ఎంతగానో కృషి చేశారు. పేద ప్రజల కోసం విద్య, వైద్యం ప్రజలకు అందేలా తన వంతు కృషి చేశారు. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి చేసిన సేవలను అధిష్టానం గుర్తించి 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో గోలి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి గోలి శ్రీనివాస్ రెడ్డి సేవలకు తగిన ఫలితం ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్ కోరారు. పేద ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారని, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే పేద ప్రజల కోసం వారి బాగోగుల కోసం రైతుల కోసం ఎంతగానో సహకరిస్తారని, వారి సేవలకు ప్రతిఫలంగా అధిష్టానం గుర్తించి, టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ఎంతగానో కృషిచేసిన టిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డికి న్యాయం చేయాలని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి అని పెద్దాపూర్ గ్రామ సర్పంచ్ గోరటి శ్రీనివాస్ అన్నారు.
గోలి శ్రీనివాస్ రెడ్డి కిఅధిష్టానం ఎమ్మెల్యే టికెట్ .
Related Posts
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల
SAKSHITHA NEWS నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : * *ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.…
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం
SAKSHITHA NEWS ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ *సాక్షిత : * ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్…