ఆదివారం ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో ఉచిత ఈ ఎన్ టీ వైద్య శిబిరం

Spread the love

Free ENT medical camp at MLA camp office on Sunday

ఆదివారం ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో ఉచిత ఈ ఎన్ టీ వైద్య శిబిరం


సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉప కరించేలా ఈ నెల 26 వ తేదిన (ఆదివారం) ఉచిత ఈ ఎన్ టీ వైద్య శిబిరాన్ని సితాఫలమండీ లోని తమ క్యాంపు కార్యాలయంలో నిర్వహించ నున్నట్లు డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.

నోవా ఈ ఎన్ టీ ఆసుపత్రి సహకారంతో నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరంలో చెవి, గొంతు, ముక్కు రుగ్మతలకు సంబంధించిన ఖరీదైన వైద్య పరీక్షలు కుడా నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నట్లు పద్మారావు గౌడ్ తెలిపారు.

ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తారని, ఆధర్ కార్డు జెరాక్స్ తెచ్చుకుంటే సరిపోతునదని తెలిపారు. ఈ సదవకాశాన్ని సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని అయన సూచించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page