బాన్సువాడ SRNK డిగ్రీ కళాశాల ప్రక్కన రూ. 6 కోట్లతో నూతనంగా నిర్మించే పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఫర్ SC & BC గర్ల్స్ భవనాలకు శంకుస్థాపన

Spread the love

బాన్సువాడ SRNK డిగ్రీ కళాశాల ప్రక్కన రూ. 6 కోట్లతో నూతనంగా నిర్మించే పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఫర్ SC & BC గర్ల్స్ భవనాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి .


సాక్షిత : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, RDO రాజా గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్ధినులు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..
సమాజంలో 80 శాతం నిరుపేద, పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఈ వర్గాలకు చెందిన వారు.
పేద కుటుంబాలలోని విద్యార్ధినులు స్కూల్, కాలేజీ నుండి ఇంటికి వెళ్ళితే తల్లిదండ్రులు ఇంటి పని, పొలం పనులు చెబుతారు. దీనితో చదువు దెబ్బతింటుంది.
విద్యార్ధినులు ఇక్కడే ఉండి చదువుకోవాలి. అందుకే ప్రత్యేకంగా బాలికల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కడుతున్నాం.

విద్యార్థులకు చదువే ఆస్థి, జీవితం. విద్యతో జ్ఞానంతో పాటుగా ఉపాది కలుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గానికి కావలసినన్ని నిధులు వస్తున్నాయి.

విద్య, వైద్యం, రోడ్లు వంటి వసతులను బాగా మెరుగుపరిచాం.
మౌళిక వసతులు కల్పించడం మా బాధ్యత, వాటిని ఉపయోగించుకుని అభివృద్ధి లోకి రావడం మీ బాధ్యత.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య పట్ల రాజీ లేదు.
మనలను నమ్ముకుని వచ్చిన విద్యార్ధినులను స్వంత బిడ్డల లాగా చూసుకోవాలి.
ఎంత మంది విద్యార్ధినులు ఉంటామన్నా వసతి కల్పిస్తాం సంఖ్య పెరిగితే ఇంకో హాస్టల్ కట్టిస్తాను.
నస్రుల్లాబాద్ లో ST గురుకుల పాఠశాల ఉన్నది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరో రూ. 7 కోట్లతో నూతన భవనానికి నిధులను మంజూరు చేశారు.
అదేవిధంగా హన్మాజిపేట- కోనాపూర్ వద్ద నూతనంగా గిరిజన బాలికల గురుకులాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చారు.
బీర్కూరు లో రూ. 6 కోట్లతో BC గురుకుల పాఠశాల, కోటగిరి లో రూ.6 కోట్లతో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలను నిర్మిస్తున్నాం.

ప్రతిభ కలిగిన విద్యార్థులే ఉద్యోగాలు పొందుతారు.
ప్రభుత్వ ఉద్యోగాలు లిమిటెడ్ గా ఉంటాయి.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి వలన తెలంగాణ రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయి.
రూ. 3 లక్షల కోట్లతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఇందులో 17.50 లక్షల మందికి నూతనంగా ఉద్యోగాలు వచ్చాయి.
8.75 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వచ్చాయి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page