SAKSHITHA NEWS

Foundation stone for construction works of Juvenile Welfare Additional Building

జువెనైల్ వెల్ఫేర్ అదనపు భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. ఆర్చరీ అకాడమీని మంత్రి, ఎమ్మెల్సీలతో ప్రారంభించిన ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ రోడ్డులో డిపార్ట్మెంట్ ఆఫ్ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో పెట్రోల్ రిటైల్ అవుట్లెట్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో సుమారు రూ.1.20 కోట్ల అంచనాతో మొదటి ఫేస్ కింద రూ.26 లక్షలతో నూతనంగా చేపడుతున్న బాలుర అదనపు భవనం నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ సురభీ వాణి దేవి తో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ శంఖుస్థాపన చేశారు.

అనంతరం జువెనైల్ ఆర్చరీ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలుర అదనపు భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం, ఆర్చరీ అకాడమీ ప్రారంభోత్సవం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ భవనంలో అవసరమైన తరగతి గదులు,

వర్క్ షాప్ లు తదితర మౌలిక వసతులు కల్పిస్తూ 18 ఏళ్ల లోపు స్పెషల్ హోం పిల్లలకు వివిధ నైపుణ్యాలు నేర్పి ఉపాధి అవకాశాలు కల్పించేలా జువెనైల్ హోం ఎంతో తోడ్పాటునందిస్తుందని చెప్పారు. ఆర్చరీ అనేది వ్యక్తిత్వ దృష్టిని పెంపొందించడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి యుగాల నుండి ఉన్న పురాతన కోర్సు అని, నిర్లక్ష్యానికి గురై నేరాల్లో పాలుపంచుకున్న పిల్లలు,

వారికి జీవితం పట్ల, దాని ప్రాముఖ్యత పట్ల విలువ తెలియక వీధుల చుట్టూ తిరుగుతూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని, అటువంటి వారికి ఆర్చరీ ముఖ్యమైన కోర్సు అని, దీని ద్వారా వారి ప్రవర్తనలో మార్పు వస్తుందనే ఉద్ధేశంతో విద్యతో పాటు ఈ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జువైనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బైగ్, సూపరింటెండెంట్ సంగమేశ్వర్, అసిస్టెంట్ డైరెక్టర్ చారువక్, అసిస్టంట్ డైరెక్టర్ స్టేట్ ఆఫ్టర్ కేర్ హోమ్ ఫర్ మెన్ ఏ.నవీన్ కుమార్, అసిస్టంట్ డైరెక్టర్ అబ్జర్వేషన్ హోం అఫ్జల్ షా అలీ, అసిస్టంట్ డైరెక్టర్ ఫర్ గర్ల్స్ హోం మైథిలి, అసిస్టంట్ డైరెక్టర్ ప్రొఫెషన్ రూరల్ రవి కుమార్, అర్బన్ కృష్ణవేణి, కాశీ, జ్వాల, సిబ్బంది గోపీ కుమార్, గంగాధర్ మరియు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS