Flowers are the beacon of hope of the barangays
బడుగుల ఆశాజ్యోతి పూలే
ఖమ్మం ఎంపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో నల్లమల
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
సమాజాన్ని సంస్కరించడానికి, సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అద్భుతమైందని రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూలే చిత్ర పటానికి పూల మాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నల్లమల మాట్లాడుతూ ఆనాటి సమాజంలో బడుగు, బలహీన వర్గాల వారు, ముఖ్యంగా మహిళలు పడుతున్న కష్టాలను చూసి, ఆయన చలించిపోయారన్నారు.
వివక్షత లేని, నవ సమాజం కోసం పరితపించి, శ్రమించారని అన్నారు. అణగారిన వర్గాలు, స్త్రీల చదువు కోసం ప్రత్యేకించి, పాఠశాలలను స్థాపించి, అందులో స్వయంగా తాను, తన భార్య ఉపాధ్యాయులుగా మారి, పాఠాలు బోధించి, స్త్రీ విద్యను ప్రోత్సహించారని అన్నారు. స్త్రీలకు ఆత్మ స్థైర్యం కల్పించి,వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడని అన్నారు.
సామాజిక సమతను సాధించడం కోసం అన్నృశ్యతకు విరుద్ధంగా పోరాటం చేసిన మహానుభావుడని కొనియాడారు. విశాల మానవ ధర్మానికి సంబంధించిన అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేశారన్నారు. భర్త చనిపోయిన స్త్రీలకు శిరోముండనం చేసే పద్దతిని తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.
సామాజిక అణచివేతను ధైర్యంగా ఎదుర్కొని , బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచారన్నారు. అంతేకాకుండా వితంతు మహిళలు, అనాధ శిశువుల కోసం సేవా సదనాలు స్థాపించారని, ‘దీనబంధు’ వార పత్రికను స్థాపించి. సామాజిక సేవ చేశారని నల్లమల పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కనకమేడల సత్యనారాయణ, తెలంగాణ జాగృతి మధిర నియోజకవర్గ నాయకులు బొబ్బిళ్లపాటి బాబూరావు, టీఆర్ఎన్ కార్మిక సంఘం నాయకులు కాసాని నాగేశ్వరరావు, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు. పాల్వంచ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.