కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పక గుర్తింపు…

Spread the love

తిరుగులేని నాయకుడు సీఎం కేసీఆర్…

కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పక గుర్తింపు…

విపక్షాల తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి…

నిజాంపేట్, బాచుపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మల్కాజ్ గిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇంఛార్జి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ సప్తపది గార్డెన్స్ లో స్థానిక మేయర్ శ్రీమతి కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్, బాచుపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ రాజు గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని మించిన మరో శక్తి రాష్ట్రంలో లేదని అన్నారు. తిరుగులేని నాయకుడు సీఎం కేసీఆర్ గారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. విపక్షాల తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. కేవలం పదవుల కోసం కాంగ్రెస్, బిజేపి నేతలు ఎంతటికైనా దిగ జారుతారని వారికి రాబోయే రోజుల్లో సరైన బుద్ధి చెప్పే విధంగా కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు. తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ఉక్కు సంకల్పంతో దేశ రాజకీయాల్లో అడుగుపెట్టి దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ గారి వెంట మనమంతా ఉండి రాబోయే రోజుల్లో అన్నీ విజయాలే అందించేలా కృషి చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కొలన్ శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, నిజాంపేట్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page