ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా ,ఇంటింటికి సంక్షేమ పథకాలు

Spread the love

ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా ,ఇంటింటికి సంక్షేమ పథకాలు వివరిస్తూ, అభివృద్ధి ని చూపిస్తూ రాయదుర్గం లో జోరుగా కొనసాగిన పాదయాత్ర ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నా పై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మళ్ళీ నన్ను ప్రకటించిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు

రాష్టంలో మళ్ళీ బీర్ఎస్ పార్టీ దే హైట్రిక్ విజయం .

శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల రాయదుర్గం లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మాజీ కార్పొరేటర్ సాయి బాబా మరియు GHMC అధికారుల తో కలిసి పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

రాయదుర్గం లో గల దర్గా హజ్రత్ సయ్యద్ కాజా హుస్సేన్ షా వలి లో చద్దర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి తదనంతరం పాదయాత్ర చేయడం జరిగినది.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సంతులిత, సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని ,వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లలో స్వయంగా ఇంటిటికి తిరుగుతూ ప్రజల నుండి తెలుసుకొని సత్వర పరిష్కారమే గా ధ్యేయంగా పనిచేస్తామని ,ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ను పరిగణలోకి తీసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


ఈ రోజు రాయదుర్గం లో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.అదేవిధంగా కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు,అక్కడికి అక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగినది.అదేవిధంగా కాలనీల లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని మరియు, నాల పూడికతీత పనులు వేగవంతం చేసి,అడ్డంకులను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని, ముఖ్యంగా డ్రైనేజి , రోడ్లు , వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంభందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడం జరిగింది అని.సమస్యలపై ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు,విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

Related Posts

You cannot copy content of this page