డయల్ యువర్ ఎస్పీ” కార్యక్రమానికి విశేష స్పందన

Spread the love
Dial Your SP" program received a great response

డయల్ యువర్ ఎస్పీ” కార్యక్రమానికి విశేష స్పందన


ఇక నుండి ప్రతి నెల ఒకటో తేదీన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపీఎస్ డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.మొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఉదయం 11.30 నుండి గంట పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి మొత్తం 19 ఫిర్యాదులు/సమస్యలను స్వీకరించడం జరిగిందని తెలిపారు.

బాధితుల సమస్యల పరిష్కారం కొరకు వెంటనే అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.ఈ సమయంలో ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలుసుకోలేని బాధితులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి నేరుగా తమని సంప్రదించవచ్చని కోరారు.ఇక నుండి ప్రతి నెల ఒకటో తేదీన ఈ “డయల్ యువర్ ఎస్పీ”కార్యక్రమం ఉంటుందని తెలియజేసారు.

Related Posts

You cannot copy content of this page