SAKSHITHA NEWS


Dharna of students in front of school gate..

పాఠశాల గేట్ ముందు విద్యార్థుల ధర్నా..!
తమకు టీచర్లు రావడంలేదని పాఠశాల ముందే విద్యార్థుల ఆందోళన.!

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

ఇక్కడి నుండి డిప్యూటేషన్ పై హైదరాబాద్ వెళ్లి..!

హైదరాబాద్ లో తమ ఇంటికీ దగ్గర గా ఉన్న పాఠశాలలోనే కొనసాగుతున్నారని మిగతా ఉపాధ్యాయుల ఆరోపణ!

విద్యార్థుల సమస్యలు పట్టించుకోని విద్యాశాఖ అధికారులు..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని గంట్లవెల్లి గ్రామ ప్రాథమికొన్నత పాఠశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు తమ పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుకుంటున్నామని తమకు సరిపోను టీచర్లు లేరని ఉన్న టీచర్లను డిప్యూటేశన్ పేరుతో హైదరాబద్ పంపించారని

ఉన్న ఒకరిద్దరు టీచర్లు సమయపాలన పాటించడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు గతంలో ఉన్న 8మంది టీచర్లకు ఇప్పుడు ఇద్దరు ముగ్గురే మిగలరాని ఆందోళనా చేపట్టారు ఇక విద్యార్థుల ధర్నా కు గ్రామస్తులు మద్దతు తెలిపారు విద్యాశాఖ అధికారుల ఉపాద్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు అక్రమ డిప్యూటేశన్ పేరుతో పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారి పోతుంది…


SAKSHITHA NEWS