ధర్మబిక్షం జీవితం ఆదర్శప్రాయం: సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

Spread the love

సాక్షిత (సూర్యాపేట జిల్లా ప్రతినిధి):

స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మ బిక్షం జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సిపిఐ ఆఫీస్ ధర్మబిక్షం భవనంలో ఆయన 13వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబు రాక్షస పాలన, రజాకార్లు, భూస్వాములు, జమీందాల ఆగడాలను అంతమొందించే ఆలోచనలతో లక్షలాది పేద ప్రజల హక్కులను స్వేచ్ఛను కాపాడాలని వారిని ఎదిరించడానికి గుండె ధైర్యంతో నిజంకుశ పాలన అంతం చేయడానికి ఉద్యమాలు నడిపిన గొప్ప వ్యక్తి బొమ్మగాని ధర్మభిక్షం అని కొనాడారు.

గీత వృత్తి కార్మికులకు కుల సంఘాల కాకుండా వృత్తి సంఘాలను ఏర్పాటు చేసి కార్మికుల తలరాతలు మార్చటమే కాకుండా దొరలకు ఊడిగం చేసే బతుకుల నుండి విముక్తి చేయించారు. గీత కార్మిక కుటుంబాలలో వెలుగులు నింపారని వన పెంపకానికి 5 ఎకరాల జీవోను సాధించి గ్రామ గ్రామాన తాటి, ఈత వనం పెంచడం ద్వారా ఉపాధి గ్యారెంటీకి పునాదులు వేశారని ఆయన అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మూసి, డిండి, ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రాజెక్టులపై పనిచేస్తున్న కూలీల హక్కుల సంక్షేమం కోసం సంఘాలు పెట్టి పోరాటాలు నిర్వహించిన కార్మిక నాయకుడు అని కొనియాడారు. ఆ మహనీయుని జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అనంతుల మల్లేశ్వరి సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, పట్టణ కార్యవర్గ సభ్యులు బొమ్మగాని శ్రీనివాస్, దోరపల్లి శంకర్, చామల అశోక్ కుమార్, నీల శ్రీనివాస్, గోపగాని రవి, ఎడెల్లి శ్రీకాంత్, దీకొండ శ్రీనివాస్ పెండ్ర కృష్ణ, తాళ్ల సైదులు, హెచ్పిసిఎల్ టాంకర్ సాయిబాబా,దికొండ రవి, పున్నం రమేష్, ఆర్టీసీ సేవ్య, కొత్వాల్ సురేందర్, రూపానివిజయ్, ప్రముఖ లాయర్లు హసన్, తొగటి మురళి, ఎల్ఐసి వెంకట్ రెడ్డి, రహీం, వాడపల్లి వెంకన్నతదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page