SAKSHITHA NEWS

Development works should be expedited and completed expeditiously.

అభివృద్ధి పనులు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్


సాక్షిత : అభివృద్ధి పనులు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ మధిర పట్టణంలో పర్యటించి, వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అంబారిపేట ట్యాoక్ బండ్ పనులను తనిఖీ చేశారు. రూ. 570 లక్షలతో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలన్నారు. వాకింగ్ ట్రాక్ పనులు జరుగుతున్నట్లు ఆయన అన్నారు. పిల్లల ఆట పరికరాలు, ప్లాంటేషన్, విద్యుత్ లైట్ల ఏర్పాటు పూర్తి అయినట్లు తెలిపారు.

పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రవేశం వద్ద వున్న టాయిలెట్ బ్లాక్ కు మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అనంతరం రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న పార్కును పరిశీలించారు. పార్కుల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలన్నారు. అనంతరం సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 450 లక్షలతో చేపట్టిన పనులు చివరి దశలో ఉన్నట్లు తెలిపారు.

మిగులు పనులు పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు వేగం చేయాలన్నారు. ఎస్బిఐ వద్ద వీధి వ్యాపారులకు షాపులకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. 60 మందికి షాపులకు స్థలం కేటాయించగా, 29 మంది షాపులు ఏర్పాటుచేసినట్లు, మిగతా వారి విషయంలో చర్యలకై అధికారులను ఆదేశించారు. రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

అనంతరం ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. స్టోర్ రూమ్, బాలికల, బాలుర టాయిలెట్ బ్లాకులు, ఆఫీస్ గది నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన అన్నారు. లోపల కోర్టుల నిర్మాణ పనులు వేగం చేయాలన్నారు. 400 మీటర్ల ట్రాక్ పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. పనులు సమాంతరంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు తనిఖీ చేశారు.

గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పనులు పూర్తయినట్లు, ప్లాస్టింగ్ పనులు చేపట్టాలన్నారు. సమావేశ గది నిర్మాణానికి ప్రణాళిక చేయాలన్నారు. పనులు జూన్ మాసాంతానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా మధిర మునిసిపల్ చైర్ పర్సన్ ఎం. లత, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వరరావు, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, డిఎస్డీఓ పరంధామ రెడ్డి, మధిర మునిసిపల్ కమీషనర్ రమాదేవి, ఎంపిడిఓ విజయ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ రాకేష్, ఇర్రిగేషన్ డిఇ నాగ బ్రహ్మయ్య, అధికారులు తదితరులు వున్నారు.


SAKSHITHA NEWS