మాదాపూర్ డివిజన్ పరిధిలోని మీది కుంట చెరువు అభివృద్ధి

Spread the love

మాదాపూర్ డివిజన్ పరిధిలోని మీది కుంట చెరువు అభివృద్ధి లో భాగంగా ఎమ్మెల్యే సీడీపీ నిధులతో మరియు Fountain Head The గ్లోబల్ స్కూల్ యాజమాన్యం మరియు మాతృ శ్రీనగర్ సంక్షేమ సంఘం వారి భాగస్వామ్యంతో చేపట్టనున్న చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ , GHMC స్టాండింగ్ సభ్యులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సీడీపీ నిధుల తో మరియు FOUNTAIN HEAD THE GLOBAL SCHOOL ఫౌండర్ అండ్ ఛైర్పర్సన్ శ్రీమతి మేఘన ముసునూరి వారి పాఠశాల విద్యార్థులు మరియు మాతృ శ్రీ నగర్ సంక్షేమ సంఘం భాగస్వామ్యం తో కలిసి చెరువును అభివృద్ధి చేయడం జరిగినది అని , చెరువు చుట్టూ ఫెన్సింగ్, చెరువు కట్ట పునరుద్దరణ, డ్రైనేజి వ్యవస్థ మల్లింపు వంటి పనులు చేయడం జరిగినది అని , త్వరలోనే చెరువును సుందరవణంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువు అభివృద్ధి లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని , ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

FOUNTAIN HEAD THE GLOBAL SCHOOL ఫౌండర్ అండ్ ఛైర్పర్సన్ శ్రీమతి మేఘన ముసునూరి ఎంతో మందికి ఆదర్శప్రాయురాలిగా నిలిచారు అని ,సమాజ హితం మంచి పనులు చేయడం అభినందించదగ్గ విషయం అని, ప్రత్యేకంగా అభినమదిస్తున్నాం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
మీదికుంట చెరువుని దత్తత తీసుకోని చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు .
వారి పాఠశాల విద్య బోధనలో భాగంగా సుందరీకరణ పర్యావరణ పరిరక్షణపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహనా కల్పిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యము చేస్తూ మీదికుంట చెరువును అభివృద్ధి పరిచిన విధానాన్ని ఎమ్మెల్యే వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులకు సృజనాత్మకతను పెంచుతాయని ఎమ్మెల్యే గాంధీ తెలియజేశారు.

చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని,ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మీది కుంట చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు . గతంలో చెరువులు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే కి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని , చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ,మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం అని ఎమ్మెల్యే విప్ గాంధీ గారు చెప్పడం జరిగింది .

ఈ కార్యక్రమంలో FOUNTAIN HEAD THE GLOBAL SCHOOL ఫౌండర్ అండ్ ఛైర్పర్సన్ శ్రీమతి మేఘన ముసునూరి , శ్రీధర్ , లేక్ మాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ maligavad, చైతన్య, రాము,కల్పన, సుధా

మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, భిక్షపతి ముదిరాజ్, కావూరి అనిల్, రఘునాథ్, సాంబయ్య,మామిడాల రాజు, రాజయ్య, గంట వాసు, విజయ్, రమేష్, సతీష్, అనిల్,శ్రీనివాస్ రెడ్డి మరియు కాలనీ వాసులు, విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page