Development of Serilingampally division under BRS government.. Corporator Ragam Nagender Yadav
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరేఖపూడి గాంధీ మరియు సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ముందుగా హుడా ట్రేడ్ సెంటర్ కాలనీలోని సీసీ రోడ్ మరియు డివైడర్ పనులకు శంకుస్థాపన
చేసిన అనంతరం మోర్ సూపర్ మార్కెట్ నుండి రైల్వే స్టేషన్ రోడ్ వరకు, బాపునగర్, ప్రశాంతినగర్, వేసిల్లా విల్లాస్, మస్జీద్ బండ లోని పలు కాలనీలలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి
చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేషం గౌడ్, హనుమంత్ రావు, హబీబ్ భాయ్, శ్రీనివాస్ గౌడ్, మోహన్ గౌడ్, రామ్ చందర్, బుచ్చిరెడ్డి, గోవింద చారి, లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ రవి యాదవ్, యాద గౌడ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాము
, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సందయనగర్ కాలనీ అధ్యక్షులు బస్వరాజ్ లింగయత్, పాపిరెడ్డి కాలనీ అధ్యక్షులు సాయినందన్ ముదిరాజ్, దాసోజు శ్రీనివాస్, ముంతాజ్ బేగం, అశోక్ కుమార్, కోయాడ లక్ష్మణ్ యాదవ్, తుకారాం, గోపి, కలివేముల వీరేషం గౌడ్, అబ్దుల్ గాఫర్,
అజీమ్, కెఎన్ రాములు, సుభాష్ రాథోడ్, మేడ్చల్ కిరణ్, నయీమ్, రఘు, ప్రభాకర్, కిషోర్, వినోద్, అలీం, దివ్య బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బస్తీ కమిటీ మెంబెర్స్, బూత్ కమిటీ మెంబెర్స్, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, తదితర కాలనీవాసులు పాల్గొన్నారు