SAKSHITHA NEWS

Development of colonies with unity of welfare societies : MLA KP Vivekanand

సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ ఫేస్-2 కి చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ పీరా రెడ్డి, జనరల్ సెక్రెటరీ రవికాంత్, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ కుమార్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS