విద్య, వైద్యానికి అధిక ప్రాముఖ్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

Spread the love

సాక్షితసికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ క్రమంలో తాము కుడా చొరవ తీసుకొని సికింద్రాబాద్ ను విద్య, వైద్య కేంద్రాల సమాహారంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, అధికారులు, నేతలతో కలిసి ప్రభుత్వ స్కూల్ లో రూ.12 లక్షలతో నిర్మించిన కొత్త తరగతి గదుల సమూహాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలు నెరవేరేలా కొత్తగా జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని, సితాఫలమండీ లో ఏర్పాటు చేసిన ఈ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లతో పాటు హై స్కూల్ భవనాల నిర్మాణానికి రూ. 30 కోట్లతో ముఖ్యమంత్రి నుంచి ప్రత్యెక నిధులను సమకుర్చుకున్నామని తెలిపారు. మన బడి కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పరిధిలో 10 ప్రభుత్వ స్కూల్ లను అభివృద్ధి చేస్తున్నామని, అవసరమైతే తన సొంత నిధులతో సైతం వివిధ సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. మండల విద్యాధికారి బాలు నాయక్, బీ ఆర్ ఎస్ యువ నేత రామేశ్వర్ గౌడ్, లింగాని శ్రీనివాస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.,

Related Posts

You cannot copy content of this page