బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, ఆగష్టు 13 : బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతోందని, సికింద్రాబాద్ లో తాము అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహితం ఏర్పాటుచేసుకొని నిరంతరం సేవలు అందిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన తుల్జా భవానీ సంఘం ప్రతినిధులు, వడ్డెర బస్తీ యువకులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సమక్షంలో ఆదివారం బీ ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ అద్వర్యంలో అడ్డగుట్ట నుంచి ర్యాలీ గా తరలివచ్చిన వారికి పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని తమ క్యాంపు కార్యాలయంలో స్వాగతం పలికి పార్టీ కండువాలు కప్పి బీ ఆర్ ఎస్ పార్టీ లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. తమకు ప్రజల్లో నానాటికీ ఆదరణ పెరుగుతోందని, అయినప్పటికీ నిత్యం ప్రజల పట్ల అంకితభావాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీ ఆర్ ఎస్ యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, పార్టీ అడ్డగుట్ట నాయకులు లింగాని శ్రీనివాస్, పాలకూర శ్రీనివాస్, దేవయ్య, వసంత, రామప్ప,, పెండెం మనోహర్, మహమూద్, గోగుల ఎల్లయ్య, ఇస్మాయిల్, జీ. రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డెర బస్తీ కి చెందిన పల్లోజు మహేష్ నేతృత్వంలో దాదాపు 50 మంది బీ జే పీ కార్యకర్తలతో సంగయ్య స్వామి నేతృత్వంలో జగన్నాధ్, శ్రీకాంత్, లక్ష్మన్, ప్రకాశ్, రెండు వందల మంది కార్యకర్తలు బీ ఆర్ ఎస్ లో చేరారు.
బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
Related Posts
జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు..
SAKSHITHA NEWS జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.. క్రిస్మస్ సందర్భంగా పల్నాడు జిల్లా టిడిపి కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కేక్…
తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”
SAKSHITHA NEWS నాగర్ కర్నూల్ జిల్లా….. తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”ఎంపికైంది.హైదరాబాద్ చెందిన “బిజ్ టీవి” అనే సంస్థ మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్య, భవనం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని అవార్డుకు…