వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు.

Spread the love

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు.

చిట్యాల సాక్షిత ప్రతినిధి

కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని మిల్లులకు త్వరగా దిగుమతి చేసుకోవాలని
డి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చిట్యాల పట్టణం పరిధిలోని ఉదయ రైస్ మిల్ వెంకటేశ్వర రైస్ మిల్ పరమేశ్వరి రైస్ మిల్, వరలక్ష్మి రైస్ మిల్, సిద్ధార్థ రైస్ మిల్ లని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
వరి ధాన్యమును త్వరగా దించుకోవాలని మిల్లర్లని ఆదేశించారు. పిపిసి కేంద్రాలలో కొనుగోలు అయిపోయి నటువంటి హమాలీలను మిల్లులకు కేటాయించి వారి ద్వారా కూడా వరి ధాన్యమును దిగుమతి చేయించడం జరుగుతున్నది జిల్లాలో ప్రతిరోజు 200 నుంచి 800 లారీల తోటి వరి ధాన్యం సెంటర్ ల నుంచి మిల్లర్లకి ఎగుమతి జరుగుతున్నది. 70934 రైతుల నుంచి 542562 మెట్రిక్ టన్నుల వరి ధాన్యమును కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో వివిధ ఖాళీగా ఉన్న గోదామ్స్ గుర్తించి ధాన్యం నిలువ చేయుటకు మిల్లుల వారికి అప్పజెప్పడం జరిగినది. జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ల ఆదేశానుసారం జిల్లాలో ఇప్పటివరకు 90% దాన్యమని కొనుగోలు చేయడం జరిగిందని మిగిలిన 10 శాతం వరి ధాన్యం త్వరగా కొనుగోలు చేస్తామని తెలిపారు. వర్షము వచ్చు సూచనలు ఉండటంవల్ల సేంటర్ ఇంచార్జ్ రైతులకు వరి ధ్యానము తడవకుండా జగర్తలు తీసుకోవాలని కొరిన్నారు. ఎపిఎం మరియు మానిటరింగ్ ఆఫీసర్లు విధిగా సెంటర్లు విసిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page