గుమ్మడిదల మండలంలో దళిత బంధు నిరసన సెగ

Spread the love

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి : కాట శ్రీనివాస్ గౌడ్
గుమ్మడిదల మండలంలో 1285 దళిత కుటుంబాలు ఉండగా, పార్టీ నాయకుల అనుచరులకు చెందిన 163 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడాన్ని కండిస్తూ, ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని ధర్నా చేపట్టి, కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గుమ్మడిదల మండలంలో ఉన్న 1285 కుటుంబాలకి దళిత బంధు ఇవ్వాలని మండల ప్రెసిడెంట్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ ధర్నాని అడ్డుకొని పోలీసులు కాట శ్రీనివాస్ గౌడ్ గారిని అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ దళిత ద్రోహి అని అన్నారు. మండలంలో 1285 కుటుంబాలు ఉంటే బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుల అనుచరులకు చెందిన 163 కుటుంబాలకే దళిత బంధు ఇవ్వడం చాలా బాధాకరమని, దళితులందరికీ దళిత బంధు ఇచ్చేవరకు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి,

మండల ప్రెసిడెంట్స్ నర్సింగ్ రావు, వడ్డె కృష్ణ, ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు వీరారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, సర్పంచ్ నీలమ్మ, జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ఛైర్మెన్ హబీబ్ జానీ, సంగారెడ్డి జిల్లా ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ యాదగిరి, పటాన్ చెరు ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ మహేష్, పెంట రెడ్డి, జయశంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, గుమ్మడిదల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బిక్షపతి, కిష్టాగౌడ్, శంకర్, వినోద్, సుధాకర్, రమేష్, నర్సింగ్, శేఖర్, మల్లేష్, శివకుమార్, పటాన్ చెరు నియోజకవర్గ మండల్ ప్రెసిడెంట్స్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్స్, గుమ్మడిదల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page