CPI-led protest in Jagatagirigutta against Narendra Modi’s arrival.
నరేంద్రమోదీ రాకను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట లో నిరసన.
సీపీఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య.
తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించి నిండు పార్లమెంట్ లో మాట్లాడి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదని నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసిస్తూ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది.
మోడీ అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసుకుంటూ దేశ సంపదను కొంత మంది వ్యక్తుల చేతిలో పెట్టి ప్రజలను అన్యాయం చేస్తూన్నారని అన్నారు. సింగరేణి బొగ్గు బావులను ప్రైవేట్ పరం,రైల్వే ను,విభజన హామీలను అమలు చేయకుండా పేరుకు పైపైన చెపుతూ ఆచరణలో మాత్రం ఏమిచెయ్యట్లేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శులు సహదేవ్ రెడ్డి,సంతోష్,నాయకులు రాజు,మల్లన్న,మల్లేష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.