ప్రజాప్రతినిధుల,అధికారుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

Spread the love

సీపీఐ నియోజకవర్గ నాయకులు నేడు ప్రగతినగర్లో వర్షం వల్ల బాలుడు మృతి చెందిన ప్రాంతాన్ని, అలాగే గాజులరామరం లో వర్షాల వల్ల మునిగిపోయిన ప్రాంతాన్ని వొక్షిత్ ఎనక్లేవ్ ను సందర్శించారు. ఒక్కరోజు కురిసిన వానకే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయని, ప్రగతినగర్లో బాలుడు మృతిచెందడం చాలా బాధాకరం అని ఇది అధికారుల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. వర్షాకాలం వస్తే నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటని సమీక్షించకుండా పనులు పర్యవేక్షించకుండా పనులు పూర్తి కాకముందే బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించడం ఘోరమైన తప్పిదామని వెంటనే సదరు అధికారుల పై చర్యలు తీసుకొని మునిసిపల్ కమీషనర్ ను కూడా తొలగించాలని డిమాండ్ చేసారు.


కొంతమంది ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో ఉన్న గొలుసుకట్టు కాలువలు కబ్జాదారులు పూడ్చివేసి అమ్ముకుంటుంటే ఆపకుండా ఆ కబ్జాదారులతోనే ఫోటోలు దిగుతుంటే ఇక అధికారులు ఏమి చేయగలరని,వారికి పదవులు, పైసల పై ఉన్న ధ్యాస ప్రజల పై లేదని అందువల్లే నేడు నియోజకవర్గ ప్రజలు చిన్న చినుకుకే ఇంతగా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదనను వ్యక్తం చేశారు.వర్షాలు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించడమే కానీ సమస్యను పరిష్కరించట్లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయకపోతే ప్రజలే తగు గుణపాఠం చెప్పుతారని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో బాచుపల్లి మండల కార్యదర్శి శ్రీనివాస్,కుత్బుల్లాపూర్ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, కోశాధికారి సదానంద్, కార్యవర్గ సభ్యులు హరనాథ్ రావ్, శ్రీనివాస్, ఇమామ్, ప్రభాకర్ స్థానికులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page