నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
సాక్షిత : 124 డివిజన్ పరిధిలోని చంద్రమ్మ కాలనీలో ఏడు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అలాగే వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సీసీ రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, వెంకటేష్, ఏడుపాయల శ్రీనివాస్, షౌకత్ అలీ మున్నా, సాయిగౌడ్, పద్మయ్య, రమేష్, కిరణ్, లింగం, ఆనంద్, మల్లీశ్వరి, నిర్మల, సుజాత, శివమ్మ, ఉమాదేవి, లక్ష్మీ, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.