జాతీయ చేనేత దినోత్సవ సంబరాలలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

జాతీయ చేనేత దినోత్సవ సంబరాలలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సాక్షిత :తెలంగాణ రాష్ట్ర పురపాలక మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ పిలుపు మేరకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారిలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేనేత కార్మికులతో కలిసి పూలమాలవేసి నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం నేతన్నలు నిర్వహించిన బైక్ ర్యాలీని కార్పొరేటర్ జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలను గుర్తిస్తూ, వారి మగ్గాలను జియో ట్యాగ్ చేయడం, చేనేత మిత్ర, నేతన్నలకు రుణమాఫీ వంటి అనేక చేనేత అభివృద్ధి, సంక్షేమం కొరకు వినూత్న పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, సిఎచ్ భిక్షపతి, కె.ప్రకాష్, పద్మయ్య, జనయ్య, పి.శివ శంకర్, వి.విష్ణు, బి.శంకరయ్య, నవీన్ కుమార్, నరసింహ రావు, మనయ్య, మోహన్, దయానంద, ఆంజనేయులు, రాములు, లక్ష్మణ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page