సాక్షిత :శేరిలింగంపల్లి డివిజన్ లో ప్రస్తుతం ఉన్న వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అనే గొప్ప ఆలోచనతో సుందరంగా తీర్చిదిద్ది రంగులతో మెరుగులు దిద్ది చిన్న మార్పులతో జిహెచ్ఎంసి వార్డు కార్యాలయముగా ఏర్పాటు చేసినందున శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , జోనల్ కమీషనర్ శంకరయ్య , నోడల్ ఆఫీసర్, డిప్యూటీ కమీషనర్ వెంకన్న చే ప్రారంభోత్సవ కార్యక్రమం చేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికై తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు పాలన అనే ఉద్దేశంతో రంగు హంగులతో తీర్చిదిద్దిన వార్డు కార్యాలయాలన్ని ప్రారంభించామన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు వాటర్ వర్క్స్ జిఎం రాజశేఖర్, మోహన్, శానిటేషన్ డిపార్ట్మెంట్ జలంధర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఎఈ సునీల్, వార్డు నోడల్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్, అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 106 డివిజన్ ఇంచార్జి గోపాల్, ఎంటమలజీ డిపార్ట్మెంట్ ఎఈ కిరణ్, గోపాల్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, హబీబ్ భాయ్, కొండల్ రెడ్డి, యాదా గౌడ్, కేఎన్ రాములు, గోపాల్ యాదవ్, రవీంద్ర రాథోడ్, నరసింహ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, రాజు, రితేష్ దూబే, క్రాంతి కిరణ్, ఆవుల రంజిత్ సాగర్, దివాకర్, మహేందర్, శ్రీనివాస్, రవి, సాయినందన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, ఏరియా కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు మహిళా నాయకురాలు సౌజన్య, భాగ్యలక్ష్మి, రజిని జయ, నిరూప, దివ్య తదితరులు పాల్గొన్నారు