చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం

SAKSHITHA NEWS

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, చెరువు లో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులకు వేగం పెంచాలని,పనులు నాణ్యత ప్రమాణాల తో చేపెట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు, చుట్టుపక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు చెరువులో కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ,చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ ద్వారా చెరువులో కలుషిత నీరు కలవకుండా సస్యశ్యామలం గా ,చక్కటి ఆహ్లదకరం గా చెరువు ను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని , చెరువు చుట్టూ పక్కల కాలనీల ప్రజలకు ఎంతగానో సాంత్వన నేటితో చేకూరింది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు ,ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పనులు వేగవంతం చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి మల్లింపు (UGD) పైప్ లైన్ నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. అదేవిధంగా ఎల్లమ్మ చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .

చెరువు ల UGD మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనుల గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే గారికి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే గారు స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ గారు చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని , చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 14 at 4.05.07 PM

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSPONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన* ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు…


SAKSHITHA NEWS

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSFESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు సాక్షిత సిద్దిపేట జిల్లా :మర్కుక్ మండలం భవనందాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాడ ఉత్సవాలు ఈనెల 16, 17,18 వ తేదీలలో జరగనున్నాయి.ఈ ఉత్సవాలని ఆశ్రమ పెద్దలు గురువులు…


SAKSHITHA NEWS

You Missed

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 21 views
PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 37 views
FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 33 views
BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 27 views
GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 22 views
BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 23 views
GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

You cannot copy content of this page