మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం

Spread the love

మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై సమ్ “టోటల్ CSR ప్రాజెక్ట్స్ వారి” ఆధ్వర్యంలో రూ. 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే అదనపు తరగతి గదులు నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ వారు పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సామజిక సేవ కార్యక్రమాలు చేయడం చాల అభినందనీయమని సమాజము కోసం ఎదో చేయాలనే తపన వలన సమాజ హితం సమాజ సేవలు చేయడం చాల గొప్ప విషయం అని, పాఠశాల ప్రాంగణంలో అదనపు తరగతుల గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, వితరణ గా గదులు నిర్మించడం చాలా గొప్ప విషయం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.


వీటిని చక్కగా సద్వినియోగ పర్చుకొని ఓదార్యం చాలా గొప్పది అని , ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుడదనే ఉద్దేశ్యంతో సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ సంస్థ వారు ఎంతో ఓదార్యం తో పేద విద్యార్థులకు మేలు కలిగే విధంగా గదులు నిర్మిస్తున్నారు అని ,త్వరితగతిన పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , మంచిగా చదివితల్లిదండ్రులకు ,సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు అదేవిధంగా సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ వారు ఎంతో సహృదయం తో, సామాజిక దృక్పథంతో CSR ఫండ్ కింద పేద విద్యార్థులకు అద్నాపి తరగతి గదులు మరియు చక్కటి మౌలిక వసతులు వితరణ ఇవ్వడం చాలా గొప్ప విషయం అని ,వారి ఉదరత కు చాలా అభినందనియం అని,ఎమ్మెల్యే గాంధీ సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరు సమాజం కొరకు చేయూతనందించాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.సామాజిక దృక్పథంతో సమాజ సేవచేయడానికి ముందుకురావడం చాలా అభినందించ దగ్గ విషయం అని,ప్రతి ఒక్కరు సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ సంస్థ ను ఆదర్శంగా తీసుకోవాలని, వీరు ఎంతో మందికి ఆదర్శప్రాయులుగా నిలిచారని ,సమాజం పట్ల సేవ చేయాలనే తపన సేవ చేయడానికి సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ సంస్థ వారిని ఎల్లవేళలా ముందు ఉంటారని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.నాయకులు కూడా తమ ప్రాంత పరిధిలోని ప్రభుత్వ పాఠశాల లకు ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఉష శ్రీ ,ఇంచార్జ్ HM రాంమోహన్ రావు, ఉపాధ్యాయులు అర్చన, విజయ, వనజ, విద్యార్థులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page