Constitution Day Celebration at Sarvajna School
సర్వజ్ఞ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుక
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
నగరంలోని వి.డి.వోస్ కాలనీలో ఉన్న సర్వజ్ఞ పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల నిర్దేశకులు ఆర్.వి. నాగేంద్రకుమార్ ప్రారంభించారు. రాజ్యాంగ పీఠికలోని అంశాలపై విద్యార్థుల, ఉపాధ్యాయులచే ప్రతిజ్ఞ చేయించారు
. అనంతరం
ఆయన మట్లాడుతూ వ్యక్తి స్వేచ్ఛను కాపాడేందుకు, పౌరులు గౌరవ మర్యాదలతో జీవించేందుకు రాజ్యంగ నిర్మాతలు ప్రజలకు, ప్రభుత్వాలకు అనేక హక్కులు, భాధ్యతలు రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. ఈ విషయాన్ని గుర్తించి అందరూ రాజ్యాంగానికి లోబడి జీవించాల్సి ఉంటుందన్నారు.
“విద్యార్థులు సైతం తమను తాము ఉన్నత వ్యక్తులుగా మలుచుకునేందుకు, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు తమదైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం
రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలను తెలియజేస్తూ విద్యార్థినీ, విద్యార్థులు పాటలు పాడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.