18 స.లు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

Spread the love

Everyone who has completed 18 years of age should be registered to vote

18 స.లు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

-జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 18 సం.లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకొనేలా, 17 సంవత్సరాలు నిండినవారు ముందస్తు నమోదులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోమినాన్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పోలింగ్ కేంద్రాల వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని,

18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులను, దివ్యాంగులను ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు. 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు అంటే, ఇంటర్ రెండో సంవత్సరం, ఆపై చదివేవారిని ముందస్తుగా దరఖాస్తును ఇవ్వడం కానీ, ఆన్లైన్ లో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

ఫామ్ – 6 ద్వారా నూతన ఓటర్లను నమోదు, ఫామ్ 6(బి), ఫామ్ – 7, ఫామ్ – 8 ద్వారా ఓటర్ల జాబితా వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతున్నదని ఆయన వివరించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి, సర్వే ద్వారా ఓటర్ నమోదు చేయాలని,

అర్హులైన కొత్త ఓటర్ల పేరు వివరాలతో జాబితా తయారుచేసి, వారందరు నమోదయ్యేలా చూడాలని అన్నారు. చనిపోయిన వారి వివరాలను సేకరించి జాబితా నుండి తొలంగింపుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులతో వారి వారి పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నది, ఎంత మంది క్రొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది, ఎంతమంది మరణించినవారు, వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయినవారు ఉన్నది, గరుడ యాప్ ఉపయోగిస్తున్నది అడిగి తెలుసుకున్నారు.

ఇతర పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్ల జాబితా ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page