Constitution Day celebrated under the auspices of the Police Department
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రజాస్వామ్య చరిత్రలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వేచ్ఛ, సమానత్వ హక్కులు కల్పిస్తూ రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగానికి విశిష్టమైన స్థానముందని అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ అన్నారు.
భారత రాజ్యాంగం రూపుదిద్దుకుని 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించబడి నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్ కార్యాలయం స్టాఫ్ ఘనంగా నివాళులర్పించి అనంతరం ప్రతిజ్ఞ పాటాన్ని అందరిచే చేయించారు.
ఈ సందర్భంగా పౌరులు, సమూహాలు, సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలనే నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ; దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు కాపాడుతానని రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్, ఏవో అక్తరూనీసాబేగం, ఆర్ ఐ రవి, సిఐ తుమ్మ గోపి, సాంబరాజు సిబ్బంది పాల్గొన్నారు.