రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి …

Spread the love

పెద్దపల్లి నియోజకవర్గం : జూలపల్లి మండలం వడ్కాపూర్ రైతు వేదికలో వడ్కాపూర్,కాచాపూర్, వెంకట్రావు పల్లి, కీచులాట పల్లి, బాల్ రాజ్ పల్లి గ్రామాల రైతులతో కలిసి రైతు వేదికలో రైతన్న సమావేశానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులతో తీర్మానం చేయించారు.*

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను అరిగోస పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెసోళ్లతో జాగ్రత్తగా ఉండాలి.. సకల సౌలతులు జేస్తున్న బీఆర్ఎస్ ను సిఎం కేసిఆర్ ని ఆశీర్వదించండీ…24 గంటల కరెంటు పై కుట్రలు చేస్తున్న కాంగ్రెసోళ్లను ఊర్లకు వస్తే నిలదీసీ తరిమికొట్టాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి…రైతుల కంట కన్నీరు కారింది. తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక అన్నదాతల గుండెలు ఆగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోని కరెంట్ కష్టాలను అంత తొందరగా ఎలా మర్చిపోతామని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని అన్నారు.9 ఏళ్లలోనే నాలుగున్నర లక్షల కోట్లను ఖర్చు చేసి సరికొత్త రికార్డు సృష్టించారని వెల్లడించారు.మూడు పంటల తెలంగాణ కావాలని బీఆర్‌ఎస్ సంకల్పం తీసుకుంటే…మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ రైతు ద్రోహ విధానాన్ని ప్రకటించిందని మండిపడ్డారు.మూడు పంటల బీఆర్‌ఎస్ కావాలా-మూడు గంటల కాంగ్రెస్ కావాలా…తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి-రాంగోపాల్ రెడ్డి,మండల పార్టీ గౌరవాధ్యక్షుడు కంది చొక్కారెడ్డి,వైస్ ఎంపీపీ మొగురం రమేష్,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్,అనుబంధ సంఘాల అధ్యక్షులు తమ్మడవేని మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్, కరాటే లక్ష్మణ్,సర్పంచ్ లు మహంకాళి తిరుపతి, శకుంతల-రవీందర్, కుంటూరి రాజయ్య,ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్ లు అడువాల తిరుపతి,మల్లారెడ్డి,విజయ-శంకర్,మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, గ్రామ శాఖ అధ్యక్షులు కన్నం రమేష్,శంకరయ్య, మల్లయ్య, భాస్కర్, ఓదెలు,రైతు సమితి గ్రామాల కో ఆర్డినేటర్ లు భగవంత రావు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page